
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై అప్పుడే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ క్లుప్తంగా స్పందించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసిన తప్పులు లేదా పాపాలకు కర్మ ఫలం అనుభవించారని ఎద్దేవా చేశారన్న మాట!
ఓడిపోయినందుకు కాంగ్రెస్ మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భరించడమే కష్టంగా ఉందనుకుంటే పార్టీ అధినేత కూతురు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత కూడా ఈవిదంగా అనడం బీఆర్ఎస్ నేతలు భరించడం ఇంకా కష్టం.
ఈ ఉప ఎన్నిక తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో, ఇటు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.