కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని అమలుచేసింది. ఢిల్లీ కారు బాంబు ప్రేలుడుతో 13 ప్రాణాలు బలిగొన్న డాక్టర్ ఉమర్ నబీకి చెందిన జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలోని ఇంటిని భద్రతా దళాలు బాంబు పెట్టి పేల్చివేశాయి. కేంద్రం ఆదేశం మేరకు గురువారం అర్దరాత్రి తర్వాత ఇంటిని కూల్చివేశారు. 

ఉగ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత కటినంగా వ్యవహరించబోతోందో దేశ ప్రజలకు, మిగిలిన ఉగ్రవాదులకు, వారి కుటుంబాలకు కూడా తెలియజేసేందుకు ఈ విదంగా బాంబులు పెట్టి పేల్చి నేలమట్టం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ యూనివర్సిటీతో సహా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసి పలువురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, ల్యాప్‌టాపులు, పెన్ డ్రైవ్‌లు డెయిరీలు వగైరా స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా దేశంలో పలు ప్రాంతాలలో సోదాలు జరుపుతూనే ఉన్నారు. ఇంకా ప్రమాదం పొంచి ఉందని భావిస్తూ రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహనాల సోదాలు, నిఘా కొనసాగిస్తూనే ఉన్నారు.