
బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 243 స్థానాలకు గాను 146 స్థానాలలో ఎన్డీయే కూటమి ఆధిక్యతలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకి 122 సీట్లు అవసరంకాగా అంతకంటే మరో 20-25 సీట్లు ఎక్కువే సాధించబోతున్నట్లు ఈ ఆధిక్యత స్పష్టం చేస్తోంది.
కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 89 స్థానాలలో ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ-ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి.
పార్టీల పరంగా చూస్తే బీజేపి 67, జేడీయు 65 స్థానాలలో ఉండగా, కాంగ్రెస్-21, ఆర్జేడీ-58స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
సర్వేలన్నీ కూడా ఎన్డీయే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ముందే చెప్పాయి. అదే జరుగబోతోంది. జన్ సూరజ్ పార్టీ సింగిల్ డిజిట్‌కి పరిమితం అవుతుందని సర్వేలు చెప్పాయి. ఆ పార్టీ విషయంలో కూడా వాటి అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.