జూబ్లీహిల్స్‌: తొలి రౌండ్ కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా కాంగ్రెస్‌-47, బీఆర్ఎస్‌-43, బీజేపి-11 వచ్చాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌-8926 ఓట్లు, బీఆర్ఎస్‌- 8864 ఓట్లు లభించాయి. కనుక పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌ కలిపి కాంగ్రెస్‌ 66 ఓట్లు ఆధిక్యంలో ఉంది. 

కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌, బీఆర్ఎస్‌ పార్టీ మాగంటి సునీత, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, మరో 53 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడిన సంగతి తెలిసిందే.