హరీష్ రావు తండ్రి మృతి

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున కన్ను మూశారు. సత్యనారాయణ స్వస్థలం కరీంనగర్‌లోని కొత్తపల్లి. ఆయన గత కొన్నేళ్ళుగా వృధ్యాప్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్‌లో హరీష్ రావు నివాసంలో ఆయన పార్ధివ దేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్ధం ఉంచారు. 

బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, పార్టీ నేతలు కేటీఆర్‌, ఇతర పార్టీల నేతలు హరీష్ రావుకు సంతాపం తెలియజేస్తున్నారు.