ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర బీజేపి అధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సభ నిర్వహించబోతోంది. ఇదివరకు కేసీఆర్, ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందనే భయంతో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెనకడుగువేశారని రాష్ట్ర బీజేపి కార్యదర్శి తూటుపల్లి రవి ఆరోపించారు.
ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోజున ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తుండటం సిగ్గుచేటనన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకు చూసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనప్పటికీ బీజేపి తప్పక నిర్వహిస్తుందని తూటుపల్లి రవి అన్నారు.
ఈ నెల 17న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, సభకు తెలంగాణ ప్రజలందరూ లక్షల సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.