అవును బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో మంటలు అంటుకున్నాయి. ఇవి కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ఆరోపణలతో అంటుకున్న రాజకీయ మంటలు కావు.
ఆమెని పార్టీని నుంచి బహిష్కరించినందుకు పార్టీలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తెలంగాణ భవన్ ఆవరణలో టపాసులు, రాకెట్లు కాల్చారు. ఆ మంటలే పైకి ఎగిసి తెలంగాణ భవన్ మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫెయిర్ ఇంజన్లతో వచ్చి మంటలు ఆర్పి వేశారు.
ఇది కేవలం అగ్నిప్రమాదమే అయినప్పటికీ, ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని బయటకు పంపిన మర్నాడే ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఆమె ఉసురే బీఆర్ఎస్ పార్టీకి తగిలిందంటూ అప్పుడే కామెంట్స్ వినిపిస్తున్నాయి.