కవితమ్మా...వచ్చి మా పార్టీలో చేరొచ్చు కదా? కేఏ పాల్

ఒక్కోసారి చాలా గంభీరంగా, ప్రమాదకరంగా సాగే రాజకీయాలలో ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ ఎంట్రీ ఇస్తే అందరూ రిలాక్స్ అయిపోయి హాయిగా నవ్వుకోకుండా ఉండలేరు.  

ఇప్పుడే అలాగే ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే... “కవితగారు మిమ్మల్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బయటకు వచ్చేశారు. కనుక మా ప్రజాశాంతి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు బీసీల కోసం పోరాడుతున్నారు కనుక మీకు సరైన రాజకీయ వేదిక మా ప్రజా శాంతి భద్రతలు క్షీణించాయి పార్టీయే. 

బీజేపి బ్రాహ్మణుల పార్టీ, కాంగ్రెస్‌ రెడ్ల పార్టీ వాటిలో మీరు చేరలేరు. చేరినా బీసీలకు న్యాయం చేయలేరు. కనుక రాష్ట్రంలో ఏకైక బీసీ పార్టీ ప్రజాశాంతిలో చేరవలసిందిగా కోరుతున్నాను. బీసీల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం,” అని కేఏ పాల్ అన్నారు.