ఒకప్పుడు అయన పవర్ స్టార్... తర్వాత జనసేనాని... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మంత్రి... ఆయనే పవన్ కళ్యాణ్. ఎవరికీ ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ఆరాధించుకుంటూనే ఉంటారు. అందరివాడు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మొదలు సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కి అభినందనలు తెలియజేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దానిలో పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రస్తానం నాటి నుంచి నేటి వరకు ఎలా సాగిందో, అంచెలంచెలుగా ఆయన పైకి ఎలా ఎదిగారో చూపారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానులందరూ కోరుకున్న శుభదినం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపారు.
దాని గురించి ఇంకా ఏదేదో చెప్పుకోవడం దేనికి డైరెక్టుగా మీరే చూసేస్తే సరిపోతుంది కదా?