ఆదివారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ పెన్ డ్రైవ్‌లలో కాళేశ్వరం నివేదికని అందజేసింది. బీజేపి, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీళ ఫ్లోర్ లీడర్లకు మాత్రం హార్డ్ కాపీలు (నివేదిక ప్రతులు) అందజేసింది.
ఆ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ మొదలు పూర్తయ్యేవరకు ప్రతీ దశలో అనేక లోపాలున్నాయి. ఇవి సరిపోవన్నట్లు ప్రతీ దశలో అవినీతి జరిగింది. ఈ కారణంగా సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని పేర్కొంది. పీసీ ఘోష్ కమీషన్ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతీ దశలో ఏవిదమైన లోపాలు జరిగాయో పూర్తి ఆధారాలతో సహా వివరాలు పేర్కొంది.
ఈ నివేదికపై ఈరోజు సాయంత్రం శాసనసభలో సమగ్రంగా చర్చించిన తర్వాత దాని ఆధారంగా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో సభ్యుల అభిప్రాయలు తీసుకుంటుంది. వారి అభిప్రాయాలు, సూచనల మేరకు ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.