నేటి నుంచి మొదలయ్యే తెలంగాణ శాసనసభ సమావేశాలలో ప్రధానంగా కాళేశ్వరం కమీషన్ నివేధికపై చర్చించి, తర్వాత కేసీఆర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ స్పందిస్తూ, “టిఆర్ఎస్ పార్టీలో ‘టి’ తీసేసి ‘బి’ పెట్టుకున్నప్పుడే వారి పార్టీకి వారు బొంద పెట్టుకున్నారు. దాంతోనే ఆ పార్టీ పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది చివరికి సొంత బిడ్డ కల్వకుంట్ల కవిత కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ పార్టీలో మిగిలిందేమీ లేదు.
అలాంటి పార్టీ కోసం మేము ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు జరిగిన సంగతి అందరికీ తెలుసు. కాదనుకుంటే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వచ్చి తన వాదనలు వినిపించవచ్చు ఎవరు వద్దన్నారు?
ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిదంగా దోచుకున్నారో, ఎంత మోసం చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ శాసనసభ సమావేశాలు. ఇవి ముగిసిన తర్వాత ఆయన సంగతేమిటో అందరికీ తెలుస్తుంది. ఆలోగా ఏం జరుగుతుందో అని తొందరెందుకు?
తండ్రి ఆశీర్వాదం తీసుకోవడం కోసం కూతురు వస్తే ఆమెను లోనికి రానీయకుండా గెంటేశారు. ఆమె అన్న, బావ ఇద్దరూ కలిసి ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు చేసి పార్టీలో నుంచి బయటకు వెళ్ళ గొట్టారు. ఆమె అమెరికా వెళ్ళిపోయారు. సొంత బిడ్డని కూడా ఆదరించని ఇవేం రాజకీయాలు కేసీఆర్?” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ప్రశ్నించారు.
(Video Courtesy: Telugu 360)