సిఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ సవాల్

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఆదివారం శేరిలింగం పల్లి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైనప్పుడు కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీని ఎదుర్కోవాలని సవాలు విసిరారు. ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ పదేళ్ళ పాలనకి, కాంగ్రెస్‌ 20 నెలల పాలనపై ప్రజల తీర్పు కోరుదామని కేటీఆర్‌ సవాలు విసిరారు. కొంతమంది బీఆర్ఎస్‌ పార్టీ నేతలు పార్టీని మోసం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయినప్పటికీ, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాని జేబులో పెట్టుకు తిరుగుతున్నారని అన్నారు. 

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలు ప్రకటించేసి అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలా అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి హైడ్రాతో పేద ప్రజల ఇళ్ళు కూల్చివేసి వారిని రోడ్లపై పడేశారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌ హయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి వివరించి, వీటిలో ఒక్క శాతం అయినా రేవంత్ రెడ్డి చేయగలిగారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కేటీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే....