కేసీఆర్‌కి మళ్ళీ అస్వస్థత... ఫామ్‌హౌసులోనే చికిత్స?

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ మళ్ళీ అస్వస్థతకు గురైనట్లు తాజా సమాచారం. ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యుల బృందం ఫామ్‌హౌసు చేరుకొని అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకొని ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎవరినీ లోపలకు వెళ్ళనీయడం లేదు. 

కేసీఆర్‌ గత నెల (జూలై)లో అస్వస్థతకు గురవడంతో యశోద హాస్పిటలలో చేరి చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వైద్యుల సూచన మేరకు మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కాళేశ్వరం కమీషన్ నివేదికపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపి 5 వారాలకు వాయిదా వేసిన తర్వాత హరీష్ రావుతో సహా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ ఫామ్‌హౌసులోనే సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.