కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇవ్వబోతున్నారు. మూడు నెలల్లోగా వారి విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
కనుక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అడ్వకేట్ జనరల్ మరియు న్యాయ నిపుణుల సలహా తీసుకొని పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే: కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, ఆరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ మహేష్ కుమార్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి.
వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించింది. కనుక వారికి నోటీసులు పంపించి వారి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఈ నోటీసులు, వివరణ, స్పీకర్ నిర్ణయం తీసుకునే ప్రక్రియ పూర్తయ్యేందుకు బహుశః మరో రెండు నెలల సమయం పట్టవచ్చు.