ఉప రాష్ట్రపతి పదవి ఎవరికి?

ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్‌ఖడ్ వ్యక్తిగత కారణాలతో గత నెల ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు బీజేపి సిద్దమవుతోంది. ఆదివారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు అమిత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు సమావేశమై ఉప రాష్ట్రపతి పదవిని ఎన్డీయే అభ్యర్ధి పేరు ఖరారు చేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు లేదా ఆర్ఎస్ఎస్‌కు చెందినా శేషాద్రి చారి పేర్లను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్‌ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగబోతోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమి తరపున అభ్యర్ధిని నిలబెడుతుందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిలబెట్టినా పార్లమెంటులో బీజేపి,ఎన్డీయే కూటమికే బలం ఎక్కువ ఉంది కనుక ఎన్డీయే అభ్యర్ధికే విజయావకాశం ఉంటుంది.