79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట చేరుకుని జాతీయ జండా ఆవిష్కరించారు.
నరేంద్ర మోడీ 2014లో ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 12సార్లు ఎర్రకోటపై జాతీయ జండా ఎగురవేశారు. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు, వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
కనుక ఎర్రకోట పరిసర ప్రాంతాలలో 11,000 మంది భద్రతా సిబ్బందిని మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చని ఢిల్లీ నగరం అంతటా నిఘా పెంచారు. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకావిష్కరణ చేస్తున్నప్పుడు రెండు ఎంఐ హెలికాఫ్టర్లు అందరిపై పూల వర్షం కురిపించాయి.
<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">VIDEO | Speaking from the ramparts of Red Fort on Independence Day, PM Narendra Modi (<a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a>) says, "It is the time of IT, data. It is the demand of the time to have indigenous Operating System, Cyber Security, Artificial Intelligence. The work should know our prowess.… <a href="https://t.co/7gpq7Wuj8R">pic.twitter.com/7gpq7Wuj8R</a></p>— Press Trust of India (@PTI_News) <a href="https://twitter.com/PTI_News/status/1956186703305265374?ref_src=twsrc%5Etfw">August 15, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>