ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నటుడు రాహుల్ సిప్లీగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో రాహుల్ సిప్లీగంజ్ మంచి ప్రతిభ కలిగిన కుర్రాడని, అతనిని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటి రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు అధికారులు రాహుల్ సిప్లీగంజ్‌కి కోటి రూపాయలు చెక్ ఇటీవలే అందించారు.
కనుక రాహుల్ సిప్లీగంజ్ మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తాను ఏనాడూ నోరు తెరిచి ఆర్ధిక సాయం చేయమని అడగకపోయినా, సిఎం రేవంత్ రెడ్డి తన సమస్యలను తెలుసుకొని, ప్రతిభని గుర్తించి ఈవిదంగా సాయం అందించి ప్రోత్సహించారని రాహుల్ సిప్లీగంజ్ అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి అతనికి శాలువా కప్పి సత్కరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు.