తెలంగాణ పోలీసులకు రెండు రాష్ట్రపతి పురస్కారాలు

తెలంగాణ పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మకమైన రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్ లభించాయి. ఏఎస్ఐ సిద్దయ్య , నిడమానురి హుస్సేన్‌లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

ఇవి కాక తెలంగాణకు ఒక గ్యాలెంటరీ మెడల్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ కూడా లభించాయి. 

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖకు రెండు రాష్ట్రపతి పురస్కారాలు, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 233 మందికి గ్యాలెంటరీ మెడల్స్, 99 మందికి రాష్ట్రపతి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్,  758 మందికి పోలీస్ సేవా పతకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి సేవలందిస్తున్న పోలీసులను ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులతో కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుంటుంది.