బీఆర్ఎస్ పార్టీ ఆగస్ట్ 14న కరీంనగర్‌లో బీసీ రిజర్వేషన్స్ అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రేపు జరగాల్సిన ఈ బహిరంగ సభని రద్దు చేస్తున్నట్లు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్స్ అమలుకి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో నిరసన దీక్ష చేశారు. కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా కరీంనగర్‌లో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటే వర్షాల కారణంగా రద్దు చేసుకోవలసి వచ్చింది. కానీ వాతావరణం చక్కబడ్డాక తప్పకుండా బహిరంగ సభ నిర్వహిస్తామని గంగుల కమలాకర్ చెప్పారు.