బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్ నోటీస్

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్ నోటీస్ పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ ప్రమేయం ఉందంటూ బండి సంజయ్‌ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. వాటిపై వెంటనే స్పందించిన కేటీఆర్‌, ఆ ఆరోపణలు రుజువు చేయాలని లేకుంటే 24 గంటలలోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు.

కానీ బండి సంజయ్‌ క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ అవే ఆరోపణలు చేస్తూ దమ్ముంటే ఏదైనా గుళ్ళో దేవుడి ముందు ప్రమాణాలు చేద్దామంటూ సవాలు విసిరారు.

కనుక బండి సంజయ్‌ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లే పరిగణిస్తూ కేటీఆర్‌ లీగల్ నోటీస్ పంపించారు. దానిలో కూడా తక్షణం క్షమాపణలు చెప్పాలని, లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. బండి సంజయ్‌ లీగల్ నోటీస్‌పై ఇంకా స్పందించాల్సి ఉంది.