తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోండి: ఎన్‌హెచ్ఆర్‌సీ

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ తెలంగాణ డిజీపీకి లేఖ వ్రాసింది. 

గత నెల 12న అయన బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకు పిర్యాదు వచ్చింది. కనుక ఆయనపై తగు చర్యలు తీసుకొని నాలుగు వారాలలో ఆ వివరాలు తెలియజేయాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ తెలంగాణ డిజీపీని లేఖ ద్వారా కోరింది.

తీన్మార్ మల్లన్న తానేమి వేరే ఉద్దేశ్యంతో ఆవిధంగా అనలేదని తెలంగాణలో ‘కులం, వియ్యం’ గురించి చెప్పేటప్పుడు అందరూ వాడే మాటే అన్నానన్నారు. కానీ తీన్మార్ మల్లన్న అన్న ఆ మాటలు విన్నవారికి ఆమెను కించపరచడానికే ఆవిధంగా అన్నారని అర్ధమవుతుంది.

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి సభ్యులు ఆయన కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పుడు వారిని చెదరగొట్టేందుకు ఆయన గన్‌ మ్యాన్ గాలిలో కాల్పులు జరిపారు కూడా. కనుక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.