మంత్రి కొండా సురేఖ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ధర్నాలో ఆమె మాట్లాడుతూ, “కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు ఆమెను మోడీ ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె భర్తని కోల్పోయిన విధవ కనుక.
అలాగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె దళితురాలు కనుక.
బీజేపి పెద్దలకి నరనరాన్న ఈ కులమదం జీర్ణించుకుపోయింది కనుకనే. అందుకే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు,” అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ మాట్లాడటం సరికాదని బీజేపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దళిత సామాజిక వర్గానికి తమ పార్టీ, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కనుకనే ఆమెను దేశంలోనే అత్యున్నతమైన పదవితో గౌరవించిందని బీజేపి నేతలు వాదిస్తున్నారు.
కానీ మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ కాంగ్రెస్ రాజకీయాలలో భాగంగా చేస్తున్న ఈ దీక్షలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.