ఇటీవల కేటీఆర్ ఏపీ బీజేపి ఎంపీ సిఎం రమేష్‌ని ఉద్దేశ్యించి కొన్ని తీవ్ర విమర్శలు చేయడంతో అయన కూడా కేటీఆర్‌కి సంబంధించి సంచలన విషయాలు ఒకటొకటి బయటపెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసుకొని కల్వకుంట్ల కవితతో సహా తమందరిపై ఉన్న కేసులు మాఫీ చేయాలని, కేటీఆర్ ధిల్లీలో తన ఇంటికి వచ్చి బ్రతిమాలుకున్నారని సిఎం రమేష్ బయటపెట్టారు.
ఈరోజు కేటీఆర్ గురించి మరో కొత్త విషయం చెప్పారు. ఆనాడు కేసీఆర్ కేటీఆర్‌కి టికెట్ ఇవ్వకుండా సిరిసిల్లాలో సుధాకర్‌కి బీఫారం ఇస్తే కేటీఆర్ వెంటనే నా దగ్గరకు వచ్చి సాయం కోరారు. అప్పుడు నేను కేసీఆర్‌ని, సుధాకర్‌ని ఇద్దరినీ ఒప్పించి సుధాకర్ పోటీ నుంచి తప్పుకునేలా చేశాను.
ఆనాడు నేను సాయపడకపోయి ఉంటే మీరు ఎమ్మెల్యే అయ్యుండేవారా ఈ స్థాయికి ఎదగ గలిగేవారా?చేసిన మేలు మరిచిపోయి నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందరినీ వాడుకోవడమే తప్ప మీకు స్నేహం విలువ తెలీదు,” అని ఎంపీ సిఎం రమేష్ కేటీఆర్‌ని విమర్శించారు. బిగ్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారో అయన మాటల్లోనే....