నాన్నకు ప్రేమతో పాదాభివందనం

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌసుకి వెళ్ళి తల్లి తండ్రుల కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ని అప్యాయంగా కౌగలించుకొని ఆశీర్వదించారు. 

బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ని స్వయంగా కలిసి, ఫోన్లు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత కూడా సోషల్ మీడియా ద్వారా అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున సీఎంవో కూడా కేటీఆర్‌కు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.