ఏపీలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులు

హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటు చేసి అప్పుడే 11 ఏళ్ళు. రోజుకి సుమారు 4. 50 లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. విశాఖపట్నం, విజయ్యవాడ నగరాలలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు టెండర్లు పిలువబోతోంది. 

రూ.11,498 కోట్లు వ్యయంతో విశాఖ మెట్రో ప్రాజెక్టు, రూ. 10,118 కోట్లు వ్యయంతో విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మించబోతోంది, రెండు ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.21,616 కోట్లు విలువగల పనులకు రేపు టెండర్లు పిలువబోతోంది. దీనిలో ఏపీ, కేంద్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. 

మూడేళ్ళలోగా లేదా 2029లో జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలోగా ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు పూర్తిచేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు.