తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ఈరోజు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత సిఎం రేవంత్ రెడ్డి పూల బొకే ఇచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. 

జస్టిస్ ఏకే సింగ్ 1965 బిహార్ రాష్ట్రంలో జన్మించారు. ధిల్లీ లా యూనివర్సిటీలో లా పూర్తి చేసిన తర్వాత పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఝార్ఖండ్ హైకోర్టుకి మారారు. 

తొలిసారిగా 2012లో ఝార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో శాశ్విత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 లో ఝార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2023 లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.