కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిసెంబర్‌కల్లా రెడీ

రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపి అధ్యక్షుడు ఎన్‌.రామచందర్ రావు కలిసి హనుమ కొండ జిల్లా, కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్‌ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

అనంతరం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తయి 2026 నుంచి ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్‌ కోచ్ ఫ్యాక్టరీలో రైల్వే ఇంజన్లు, వేగన్లు, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్ రైళ్ళ కోచ్‌లు, అలాగే వందే భారత్, మెట్రో రైల్ కోచ్‌లు తయారవుతాయి. 

ఈ కోచ్ ఫ్యాక్టరీలో రైల్వే స్టేషన్‌ ఇంజన్లు, వేగన్లు, కోచ్ మరమత్తుల కోసం అతిపెద్ద విభాగం ఏర్పాటు చేస్తున్నారు. నిర్మిస్తారు. రూ.500 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ కోచ్ ఫ్యాక్టరీలో సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇది భారతదేశంలో అతి పెద్ద కోచ్ ఫ్యాక్టరీగా నిలువబోతోంది,” అని చెప్పారు.