టీడీపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ పదవి చేపట్టబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నాలుగైదు రోజుల క్రితమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది రాజ్యాంగ బద్దమైన పదవి కనుక ఆయన నిన్న టీడీపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1982లో ఎన్టీఆర్ టీడీపిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అశోక్ గజపతి రాజు పార్టీలోనే ఉన్నారు. పార్టీ ద్వారా ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు పొందారు. కానీ టీడీపిలో ఉన్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజుని చాలా దారుణంగా అవమానించారు. అయినప్పటికీ అశోక్ గజపతి రాజు ఏనాడూ మాట జారలేదు. చాల హుందాగానే వాటిని ఎదుర్కొని భరించారు.
రాజకీయాలలో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన అశోక్ గజపతి రాజు ఇప్పుడు గోవా గవర్నర్ పదవి చేపట్టబోతున్నారు. కనుక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.