రాజ్యసభ సభ్యుడుగా కమల్‌ హాసన్‌ ప్రమాణ స్వీకారం త్వరలో..

ప్రముఖ నటుడు కమల్ హాసన్, మక్కల్‌నీది మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడు రాజకీయాలలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ 2018 నుంచి ఇంత వరకు జరిగిన ఏ ఒక్క ఎన్నికలలో ఆయన, పార్టీ అభ్యర్ధులు గెలవలేకపోయారు. 

2021లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కూడా ఆ పార్టీ పోటీ చేసేందుకు సిద్దపడింది. అయితే తమ కూటమికి మద్దతు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే ఆఫర్ ఇచ్చింది. ఎన్నికలలో పోటీ చేసి మరోసారి ఓడిపోవడం కంటే ఇదే మంచిదనుకున్న కమల్ హాసన్ పోటీ నుంచి తప్పుకొని డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇచ్చారు. 

డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ హామీ  ప్రకారం కమల్‌ హాసన్‌కు రాజ్యసభ టికెట్ కేటాయించారు. కనుక ఆయన ఈ నెల 25న రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.