పోస్టాఫీసుల వద్ద క్యూ కడుతున్న మహిళలు

నేడు తెలంగాణలో పలు జిల్లాలలో పోస్టాఫీసుల వద్ద భారీ సంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న మహిళలకు మహాలక్ష్మి పధకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రభుత్వం నెలకు రూ.2500 చొప్పున జామా చేస్తుందని పుకార్లే దీనికి కారణం. దీంతో రాశరత్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఈరోజు ఉదయం నుంచే మహిళలు పోస్టాఫీసుల వద్ద సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నీలాబడ్డారు.

మహాలక్ష్మి పధకం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని, పుకార్లు నమ్మవద్దని పోస్టాఫీస్ సిబ్బంది ఎంతగా చెపుతున్నా మహిళలు వినలేదు. ఏది ఏమైనప్పటికీ మహిళలు తమంతట తామే పోస్టాఫీసులకు వచ్చి సేవింగ్స్ ఖాతాలు తెరిస్తే అందరికీ మంచిదేనని  సిబ్బంది వారి వివరాలు తీసుకొని ఖాతాలు తెరుస్తున్నారు.

ఇటువంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తమకు తెలుసునని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు.