ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సమావేశం కానున్నారు. ఏపీ ప్రభుత్వం సూచన మేరకు ఈ సమావేశంలో వివాదాస్పద బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించి ఓ పరిష్కారం కనుగొందామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసి, అభిప్రాయం కోరింది.
కానీ దీనిపై ఎటువంటి చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ వ్రాసినది. ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు కనుక గోదావరి రివర్ బోర్డ్, సీడబ్ల్యూసీ, ఈఏసీ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపాయని కనుక దీనిపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని, కనుక ఈ బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని అజెండాలో చేర్చవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ వ్రాసింది.