జూలై 14 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ

తెలంగాణలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ శుభవార్త చెప్పింది. ఈ నెల 14న సిఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో జరిగే బహిరంగ సభలో లాంఛనంగా అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు సభలు నిర్వహించి ఎంపిక అయిన అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తారు. 

మొత్తం 2.40 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ లెక్కన మొత్తం 11.30 మందికి రేషన్ సరుకులు అందుతాయి. ఇంతకు ముందు ప్రభుత్వం 41 లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేసింది. కనుక వీటితో కలిపి మొత్తం 94,72,422 రేషన్ కార్డులు జారీ చేసినట్లవుతుంది. వీటి ద్వారా రాష్ట్రంలో మొత్తం 3.14 కోట్ల మందికి రేషన్ సరుకులు అందుతాయి.