కాళేశ్వరం కమీషన్: హరీష్ రావుకు మళ్ళీ నోటీస్

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ మాజీ మంత్రి హరీష్ రావుని మంగళవారం విచారణకు హాజరుకావలంటూ మళ్ళీ నోటీస్ పంపింది.

ఇదివరకు విచారణకు హాజరైనప్పుడు మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి చర్చించి ఆమోదించామని, ప్రాజెక్టుకి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఉన్నాయని హరీష్ రావు చెప్పారు.

కనుక కమీషన్ ప్రభుత్వానికి లేఖ వ్రాసి నాటి మంత్రివర్గ సమావేశ వివరాలను రప్పించుకుంది. వాటిని పరిశీలించిన తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు చెప్పినదానికి, జరిగిన దానికి కొంత తేడా ఉన్నట్లు కమీషన్ గుర్తించింది. కనుక వాటి గురించి ప్రశ్నించేందుకు హరీష్ రావుని విచారణకు హాజరుకావలంటూ కమీషన్ నోటీస్ పంపింది.

మరి హరీష్ రావు హాజరవుతారో లేదో? హాజరైతే మంత్రివర్గ సమావేశం గురించి కమీషన్ ఆడగబోయే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెపుతారో?