తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 10వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ప్రతీ మూడు నెలలకు ఓ సారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంత వరకు అమలు చేశాము?ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి?ఒకవేళ కార్యాచరణ జరుగకపోయుంటే ఎందువల్ల జరుగలేదు?అవరోధాలేమిటి? వాటిని ఏవిదంగా తొలగించాలి?అని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.
ఇవి కాక కొత్త రేషన్ కార్డుల జారీ, సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించినందున వాటి కోసం బీసీ రిజర్వేషన్స్ ఖరారు చేయడం, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏవిదంగా ముందుకు సాగాలి? ఎన్నికల హామీ ఆమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు, విమర్శలపై చట్ట పరంగా చర్యలు తీసుకునే అంశంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.