మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం హైదరాబాద్, మహా టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంపై బిఆర్ఎస్ పార్టీ దాడిని సమర్ధించుకుంటున్నట్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“మీడియా ముసుగులో కేసీఆర్, కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు వ్రాస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే. మేము దాడి చేస్తే వేరేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే ధైర్యంతో ఏడాదిన్నరగా ఇష్టం వచ్చినట్లు వ్రాస్తున్నారు.
మీడియా ముసుగులో వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారు. మా సహనం నశించింది. మీడియా మీకు ఆయుధం అయితే మా వద్ద ఆయుధాలు లేవనుకున్నారా?అవి మీడియా హౌసులు కావు. ఆ పేరుతో వ్యక్తిత్వ హనానానికి పాల్పడే స్లాటర్ హౌసులు అవి. అలాంటివి మరో రెండు మూడున్నాయి. ఇక నుంచి ప్రజా కోర్టులోనే వాటి పని కూడా పడతాం. ఎవరిని చూసుకొని మీకు ఈ బలుపు?” అంటూ జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.
జగదీష్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..