ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అధికారులకు ఓ విజ్ఞప్తి చేశారు. రేపు (శనివారం) బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను నరికి చంపవద్దని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో గోవులను పవిత్రంగా పూజిస్తాము. కనుక దొంగచాటుగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..
గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 5, 2025
గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనది. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం. గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి…