ప్రధాని మోడీకి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సూటి ప్రశ్నలు

ఆపరేషన్ సింధూర్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌-బీజేపిల మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో బీజేపి ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్‌ తాజా ప్రసంగాలు, దేశవ్యాప్తంగా బీజేపి తిరంగా యాత్రలు ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.      

తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని రాహుల్ గాంధీ అంటే సూటిగా సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ నేతలెవరికీ దేశభక్తి లేదని బీజేపి నేతలు వితండవాదం చేస్తున్నారు.

కానీ ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఓ ఇంటర్వ్యూలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని అంగీకరించారు. కనుక ఇప్పటికైనా ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామో మోడీ ప్రభుత్వం బయటపెట్టాలి,” అని అన్నారు.