భారత్-పాక్ యుద్ధం నిలిచిపోయిన తర్వాత ఇరు దేశాల సరిహద్దులలో మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ పరస్పరం విధించుకున్న గగనతల ఆంక్షలు, వాఘా సరిహద్దు మూసేవేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటివి యధాతధంగా సాగుతూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేడు సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నవారు కూడా మన కుటుంబ సభ్యులే. ప్రధాని మోడీ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అత్యంత శక్తివంతమైన దేశంగా మారిన భారత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనమైతే తాము కూడా అభివృద్ధి ఫలాలు పొందవచ్చని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కనుక పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు,” అని అన్నారు.