తెలంగాణ హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులు, ఓ ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు. గతంలో తెలంగాణ హైకోర్టులో పనిచేసి ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్ళిన జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత ముగ్గురినీ సుప్రీంకోర్టు కొలీజియం మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ సుజోయ్ పాల్ని కలకత్తా హైకోర్టుకి బదిలీ చేసింది.
ఈ మార్పులు చేర్పుల తర్వాత తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 31 మంది అవుతారు. కానీ మరో 11 న్యాయమూర్తుల పోస్టులు ఇంకా భర్తీ చేయవలసి ఉంది.