ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడులో అధికార డీఎంకె పార్టీ ఆయనని రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించింది.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, డీఎంకె పార్టీలకి మద్దతుగా ఎంఎన్ఎం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. కమల్ హాసన్ స్వయంగా కాంగ్రెస్, డీఎంకె అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు.
అందుకు ప్రతిగా ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని అప్పుడే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే కమల్ హాసన్‌ని రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించారు.
జూన్ 19న అస్సాంలో రెండు సీట్లు, తమిళనాడులో 6 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. తమిళనాడులో డీఎంకె పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఆ బలంతో నాలుగు సీట్లు గెలుచుకోగలదు. వాటిలో ఒక సీటుని కమల్ హాసన్‌కి కేటాయించింది. కనుక వచ్చే పార్లమెంట్ సమావేశాలలో కమల్ హాసన్ కూడా రాజ్యసభలో కనిపించనున్నారు. మిగిలిన రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్, మరొకటి అన్నా డీఎంకె దక్కించుకుంటాయి.