తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు నేటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ ఇంజనీరింగ్ అద్భుతమని గొప్పగా చెప్పుకుంతున్నారు. కానీ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద బాంబు పేల్చారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. కాంట్రాక్టులు కూడా చేశాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బాగా తెలుసు. వాటిలో నీళ్ళు నిలబెడితే డ్యామ్‌లు కొట్టుకుపోతాయని, దిగువన గల ఊళ్ళు మునిగిపోతాయని ఈ రంగంలో నిపుణులైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ బృందం చెపుతుంటే, మళ్ళీ వాటిలో నీళ్ళు నింపాలని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
దీనికి మరో పరిష్కారం లేనేలేదు. మూడు డ్యాములు (మేడిగడ్డ, అన్నారం సుందిళ్ళ) పూర్తిగా తీసేసి కొత్తవి కట్టుకోవలసిందే,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్‌లో క్రుంగిన మూడు పిల్లర్లని పునాదులతో సహా తొలగించి వాటి స్థానంలో కొత్తగా నిర్మిస్తే సరిపోతుందనట్లు చెపుతున్నారే తప్ప ఎవరూ మొత్తం డ్యామ్ కూల్చేసి కొత్తగా నిర్మించాలని చెప్పలేదు.
కానీ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూడు పిల్లర్లు కాదు మూడు డ్యాములు కూల్చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలని చెపుతున్నారు. మరిప్పుడు సిఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఏవిదంగా స్పందిస్తారో?
కాళేశ్వరం మొత్తం కొట్టుకు పోతుంది.. దాన్ని మనం ఏం చేయలేము
3 డ్యాంలు తీసేయాల్సిందే.. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను నాకు తెలియదా - మంత్రి కోమటి వెంకట్ రెడ్డి pic.twitter.com/xFug7KerT8