దేశంలో ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులలో మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒకరు. కానీ భారత్ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో నిన్న రాత్రి పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేయడాన్ని కూడా ఆయన రాజకీయ కోణంలో నుంచే చూసి మాట్లాడుతారని భావించగా, ‘ఆపరేషన్ సింధూర్’ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ బలగాలు దాడులు చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. పాకిస్థాన్ మళ్ళీ ఎన్నడూ పహల్గాం వంటి ఉగ్రదాడులు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థల స్థావరాలను నాశనం చేయాలి. జై హింద్!,” అని ట్వీట్ చేశారు.
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025