భారత్‌-పాక్ యుద్ధ సన్నదతలో భాగంగా రేపు మాక్ డ్రిల్!

భారత్‌-పాక్ మద్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండటం, భారత్‌పై అణు బాంబులతో దాడి చేస్తామని పాక్ మంత్రులు బెదిరింపుల నేపధ్యంలో రేపు (బుధవారం) దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 259 ప్రాంతాలలో భద్రతా దళాలు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. 

దీనిలో భాగంగా భద్రతా దళాలు సామాన్య ప్రజలు, విద్యార్ధులు, పరిశ్రమలు, వివిద సంస్థల సిబ్బందికి రాష్ట్రాలలో ఉన్నతాధికారులు, పోలీసులు, అగ్నిమాపక, విద్యుత్ వంటి శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఒకవేళ పాకిస్థాన్‌ భారత్‌పై దాడి చేస్తే ఏవిదంగా ప్రాణాలు కాపాడుకోవాలి. దాడులకు గురికాకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి?వంటివి నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్, వాటికి అనుసంధానమైన పబ్లిక్ మైక్ సిస్టమ్, సీసీ కెమెరాలు వగైరా ఉన్నాయి. కనుక శిక్షణలో అక్కడి నుంచి సైరన్ మోగించగానే ప్రజలు ఏవిదంగా స్పందించాలనేది భద్రతా దళాల నేర్పిస్తాయి. 

గతంలో అంటే 1951, 1962 1965 యుద్ధాల సమయంలో దేశవ్యాప్తంగా ఈవిదంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత నిర్వహిస్తున్నారు.