మావోలతో మాటల్లేవ్.. చేతలే: బండి సంజయ్‌

తెలంగాణ బీజేపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆదివారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “మావోయిస్టులతో ఇక మాటల్లేవ్.. చేతలతోనే వారికి అర్దమవుతుంది.

అనేకమంది పోలీసులను, ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజన ప్రజలను అతికిరాతకం హత్యలు చేస్తున్నవారితో చర్చలు దేనికి?వారితో చర్చించాలని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో వారిపై నిషేధం విధించిన సంగతి మరిచినట్లుంది.

సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని అలిపిరిలో మందుపాతర పెట్టి మావోయిస్టులు హత్య చేయాలని ప్రయత్నించారు. ఇంకా అనేక మంది రాజకీయ నాయకులను హత్యలు చేశారు. 

అయినప్పటికీ మావోయిస్టులను తుపాకులు వదిలి స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరాము. అందుకు వారికి తగినంత గడువు కూడా ఇచ్చాము. కానీ వారు అందుకు అంగీకరించనందునే సమాజానికి హానికరంగా మారిన వారిని నిర్మూలించక తప్పడం లేదు,” అని బండి సంజయ్‌ అన్నారు.