భారతీయ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు అత్యవసర సమయంలో ల్యాండింగ్, టేకాఫ్‌కి అనుకూలంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షాజహాన్ పూర్ వద్ద నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నాయి. రాత్రిపూట కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేసేందుకు వీలుగా జాతీయ రహదారిలో సుమారు 3.5 కిమీ పొడవున ప్రత్యేకంగా నిర్మించారు.
ఈ జాతీయ రహదారి పాకిస్థాన్‌కు సుమారు 1,000 కిమీ దూరంలో ఉంటుంది. గంటకు 500-600 కిమీ కంటే వేగంగా దూసుకుపోగల యుద్ధ విమానాలు ఇక్కడి నుంచి పాకిస్థాన్ చేరుకోవడం, దాడి చేసి వెనక్కు తిరిగి రావడానికి ఈ జాతీయ రహదారి చాలా అనుకూలంగా ఉంటుంది.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ, రాజ్‌నాధ్ సింగ్, అమిత్ షా ముగ్గురూ చెప్పారు కనుక ఏ క్షణంలోనైనా భారత్ వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడి చేసే అవకాశం ఉంది.
కనుక అందుకు సన్నద్ధమవుతూ ఈ జాతీయ రహదారిపై ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది భారత్ వాయుసేన. ఇక్కడి నుంచి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ చేస్తూ పరీక్షించుకుంటున్నాయి.