కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “పహల్గాంలో 28 మంది పర్యాటకులను చంపి మీరేదో విజయం సాధించారని భ్రమపడొద్దు. మీ ఉగ్రదాడితో భారత్‌ని భయపెట్టలేరు. ఈ ఘాతుకానికి పాల్పడినవారిని, వారిని ప్రోత్సహించినవారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టే వరకు పోరాదుతాము.
గత 30-40 సంవత్సరాలుగా జమ్ము కశ్మీర్లో పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని భరిస్తూనే ఉన్నాము. కానీ మా సహనం వాళ్ళకు అలుసుగా కనపడుతోంది. కనుక ఇకపై ఉగ్రవాదం అణచివేయడంలో భారత్ ‘జీరో టాలరెన్స్’తో వ్యవహరిస్తుంది.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మించి తీరుతాము. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సాహిస్తున్నవారు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. భారత్‌పై చేసే ప్రతీ దాడికి అంతకంటే ఎక్కువ స్థాయిలోనే జవాబు ఇస్తాము. 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ దేశాలు భారత్‌కు సంఘీభావం తెలిపాయి,” అని అన్నారు.
పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ముగ్గురూ పదేపదే హెచ్చరిస్తున్నారు. కనుక 24-36 గంటల లోపే భారత్ తమపై దాడి చేయవచ్చని పాక్ మంత్రులు చెపుతున్నారు. కనుక ఏ క్షణంలో ఏం జరుగుతోందో తెలీదు.