తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విజయవాడకు వచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కుమారుడి వివాహానికి సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యి నూతన వధూవరులను నిహార్, సాయి నర్మదలను ఆశీర్వదించారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో విజయవాడ చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రా మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు హెలిప్యాడ్ వద్ద సాదరంగా స్వాగతం పలికి వివాహ వేదిక వద్దకు తోడ్కొని తీసుకువెళ్ళారు.
అక్కడ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సిఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించగా ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులు హాజరయ్యారు.