కేటీఆర్‌కి మళ్ళీ గాయం.. బెడ్ రెస్ట్!

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా గాయపడ్డారు. “వెన్నెముక డిస్క్ జారినట్లు కేటీఆర్‌ స్వయంగా తెలిపారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని, త్వరలోనే నా కాళ్ళపై నేను నిలబడతానని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

కేటీఆర్‌ ఇదివరకు కూడా జిమ్‌ వర్కవుట్స్ చేస్తుండగా గాయపడ్డారు. అప్పుడు కాలికి గాయం కాగా ఇప్పుడు వెన్నెముకకి గాయం అయ్యింది. మొన్న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగిన రోజునే కేటీఆర్‌ గాయపడ్డారు.

అయినప్పటికీ చివరి నిమిషం వరకు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సభలో పాల్గొన్నారు కానీ ప్రసంగించలేదు. ఇప్పుడు సభ హడావుడి ముగిసింది కనుక ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు.