ఆమెకు ఆ పదవి.. సమర్దత, విధేయతకు బహుమానమే!

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆమె స్థానంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణ రావు బాధ్యతలు చేపట్టనున్నారు. 

అయితే కేసీఆర్‌ హయాంలో సీఎగా నియమితులైన శాంతి కుమారి రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా విధేయంగా ఉంటూ అత్యంత సమర్ధంగా తన పని తాను చేసుకుపోయేవారు. 

ఆమె విధేయతకు, సమర్ధతకు తగిన బహుమానం లభించింది. ఆమె పదవీ విరమణ చేయక మునుపే రాష్ట్ర ప్రభుత్వం ఆమెను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు వైస్ చైర్ పర్సన్‌ నియమించింది. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రంగునందన్ రావు సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.