జీహెచ్ఎంసీ బరిలో బీజేపి కూడా దిగిందే

జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 23న  పోలింగ్ జరుగబోతోంది. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఓటర్లుగా జరిగే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి బలం లేనందున ముందే పోటీ నుంచి తప్పుకుని మజ్లీస్ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. . 

బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ మజ్లీస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఈ ఎన్నికకు దూరంగా ఉండి ఆ పార్టీ అభ్యర్ధి మీర్జా రహమత్ బేగ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. 

మొదట బీజేపి కూడా ఈ ఎన్నికలో పోటీ చేయకూడదని అనుకుంది. కానీ బీజేపి ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుని మజ్లీస్‌కు దక్కించేందుకు కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు సిద్దపడటంతో, బీజేపి కూడా తమ అభ్యర్ధిగా ఎన్‌.గౌతం రావుని బరిలో దింపింది. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.